![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -299 లో..... జయని చూడడానికి వీరు, ఇషిక వస్తారు. వాళ్ళ వంక జయ కోపంగా చూస్తుంది. ఏంటి జయ ఇలా చేస్తే పిన్ని ఎంత బాధపడుతుందని వీరు యాక్టింగ్ చేస్తాడు. పిన్ని మీరు నీరసంగా ఉన్నారు బయటకు వెళ్లి టీ తాగి రండి లచ్చమ్మ మీరు తీసుకొని వెళ్ళండి అని ఇషిక అంటుంది. దాంతో లక్ష్మి తీసుకొని వెళ్తుంది. జయతో వాళ్ళు మాట్లాడతారు. ఏంటి మీ ప్లాన్ ఫెయిల్ అయిందా అని జయ అంటుంది. నిజమైన విషం ఇచ్చారని కోపంగా చూస్తుంది. మేం కావాలనే ఇచ్చామని వీరు అంటాడు. నేను చెయ్యాల్సింది నేను చేస్తానని జయ అంటుంది.
మరొకవైపు ప్రమీల వంక కార్తీక్ చూస్తూ ఉంటాడు. అలా చూడడం మక్కమ్ చూసి.. ఈ విషయం రుద్ర సర్ కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడతాడు. అప్పుడే చిన్నపిల్లలు ఐ డొనేట్ కి డబ్బు అని చందాకి వస్తారు. వాళ్ళని చూసి ప్రమీల ఎమోషనల్ అవుతుంది. వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత భాను చనిపోయాక తన కళ్ళని డొనేట్ చేసిన విషయం గుర్తుచేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత రుద్రకి ప్రమీల ఫోన్ చేసి బావగారు మీతో మాట్లాడాలి అర్జెంట్ గా రమ్మని చెప్తుంది దానికి రుద్ర సరే అంటాడు. అక్కడే ఉన్న మక్కమ్ అది విని.. కార్తీక్ గురించి రుద్ర సర్ తో ప్రమీల మేడమ్ చెప్పిందేమోనని అనుకుంటాడు. అదంతా కార్తీక్ తో చెప్తాడు మక్కమ్. కంగారుపడకండి అదేం లేదని కార్తీక్ అంటాడు. అప్పుడే రుద్ర, గంగ, రంగా వస్తారు. ఏంటి ప్రమీల రమ్మన్నావని రుద్ర అడుగుతాడు. భాను కళ్ళు డొనేట్ చేశారు కదా ఎవరికి పెట్టారు.. మీకు ఏమైనా తెలుసా అని ప్రమీల అడుగుతుంది. తెలుసని రుద్ర అంటాడు. ఆ కళ్ళు ఒకసారి చూడాలని ఉందని ప్రమీల అనగానే సరే అని కార్తీక్ ని పిలుస్తాడు. కార్తీక్ ని బాగా చూడు ప్రమీల మన సేల్స్ పెంచాడని రుద్ర కవర్ చేస్తాడు.
ఆ తర్వాత కార్తీక్ ని అక్కడ నుంచి వెళ్ళమంటాడు. నువ్వు హ్యాపీనా అని రుద్ర అడుగుతాడు. నాకేం అర్థం కావడం లేదని ప్రమీల అంటుంది. భాను కళ్ళు కార్తీక్ కి పెట్టారు.. అందుకే అతన్ని జాబ్ లో పెట్టాను.. ఆ విషయం కార్తీక్ కి తెలియొద్దు.. అందుకే జాబ్ లో పెట్టుకున్నారని అనుకుంటాడని రుద్ర చెప్పగానే ప్రమీల షాక్ అవుతుంది. భాను కళ్ళు ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటాయని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ, రంగా కార్ లో వెళ్తుంటారు. మీరు అక్కని కార్తీక్ ని దగ్గర చెయ్యడానికి అలా చెప్పారు కదా అని గంగ అనగానే లేదు నిజమే చెప్పాను నిజంగానే కార్తీక్ కి భాను కళ్ళు పెట్టారు. అందుకే అతన్ని సెలక్ట్ చేసానని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |